గత రెండు వారాలుగా మన రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సగటున 43 నుంచి 45 డిగ్రీలుగా నమోదవ్తున్నాయ్. ఐతే ఈ సగటు ఉష్ణోగ్రతలలో ఆస్తి పంపకాలు తప్పనిసరి.
సగటున నమోదవ్తున్న ఉష్ణోగ్రత 44 డిగ్రీలు
నీ ఏ.సి Outdoor Unit వదిలే వేడి వలన (2) డిగ్రీలు
నువ్వు చెట్లు నరికేయడం వలన (3)డిగ్రీలు
చెట్లు నరుకుతుంటే ఆపకుండా చూస్తూ కూర్చున్నందుకు (1) డిగ్రీ
Rain water harvesting చేయకుండా వర్షపు నీటిని వౄధా చేసినందుకు (1) డిగ్రీ
ఇంకుడు గుంతలు తవ్వకపోవటం వలన (1) డిగ్రీ
ఇంధనం పొదుపుగా వాడనందుకు (1/2) డిగ్రీ
______
అసలు నమోదవ్వాల్సినది 35.5 డిగ్రీలు
నిజానికైతే ఆ 35.5 డిగ్రీలు తట్టుకునే శక్తి మనలో ఉంది. ఆ తట్టుకోలేని శాతం ఉంది చుశారూ, అది మనం కొని తెచ్చుకున్న వేడి.
ఇది చదివి ముక్కున వేలేసుకోవటం కాదు. ఏమైనా చేయగలమా ఆలోచించండి.
ఒక గంట ఏ.సి ఆపిచూడండి. వెంటనే పెద్దగా తేడా అనిపించకపోవచ్చు. కానీ మీ శ్రమకు ఫలితం ఉంటుంది.
నిను నువ్వు ప్రశ్నించుకో.
1. మీరు చివరిగా మిద్దెపై చంద్రుడిని చూస్తూ పడుకున్నది ఎప్పుడు?
2. మీరు చివరిగా ఒక మొక్కనాటి ఎన్నేళ్ళైంది?
3. కనీసం మీచేత్తో ఒక మొక్కకు నీళ్ళుపోసి ఎన్నేళ్ళైంది?
4. ఇంటిపై సున్నాలు వేయించండి. తాటాకులొద్దు.
5. రాత్రులు కిటికీలో టేబుల్ ఫాన్ పెట్టుకుని పడుకోండి.
చివరిగా: ఉపశమనం కోర్కోని శరీరం అంటూ ఉండదు. కానీ నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఇవాల్టి ఎండను భరిస్తావో లేక రేపటి వేడికి మసౌతావో.