Home » » చైనా పై మనము యుద్ధం చేయొచ్చు

చైనా పై మనము యుద్ధం చేయొచ్చు

బీహారోళ్ళు దమ్మున్నోళ్ళు కాబట్టి పాకిస్తాన్ కు మద్దతు ఇస్తున్న చైనా దేశపు వస్తువులు అమ్మినవాళ్ళకి 2000 కొన్నవాళ్ళకి 1000 రూపాయలు జరిమానా విధిస్తున్నారు. అదే మన ఎదవలైతే చవగ్గా వచ్చే చైనా వస్తువుల్ని మేమెందుకు కొనకూడదు అంటూ ఎదవ లాజిక్కులు లాగుతున్నారు. ఇలాంటి చవటలూ, సన్నాసులూ మన దేశంలో ఉన్నారు కాబట్టే చైనా మీడియా మన ఇండియాకీ, ఇండియన్స్ కీ అంత సీన్ లేదనీ, చైనా వస్తువులు కొనొద్దని ఎవరు ఎన్ని చెప్పినా ఎంత ప్రచారం చేసినా వాళ్ళకేం నష్టం లేదనీ వాళ్ళ వ్యాపారపు వెంట్రుక కూడా పీకలేమనీ పబ్లిగ్గా ఆర్టికల్స్ రాస్తుంది. భారత్ లో ప్రభుత్వ విభాగాల్లో అవినీతి ఉద్యోగులూ, అవినీతి నాయకులు అధికమనీ మేక్ ఇన్ ఇండియా వంటివి చెప్తూ ప్రజల్ని నమ్మిస్తున్నారు తప్ప ఇప్పట్లో అలాంటివి జరిగే అవకాశాలు ఎంత మాత్రం లేవనీ గ్లోబల్ మీడియా వంటి పత్రికలు విశ్లేషణ చేస్తున్నాయి. మనోళ్ళు ఎంత డబ్బున్నా స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటారు తప్ప ఇలాంటి వాటి కోసం పెట్టుబడులు పెట్టరు కదా... అందుకే మన ఎదవల మీద అంత నమ్మకం వాళ్ళకి.
మనం దాదాపుగా సంవత్సరానికి 3లక్షల 83 వేల కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 18% చైనా వస్తువుల్ని దిగుమతి చేసుకుని ఆ ప్రభుత్వానికి 80 వేల కోట్లకు పైగా ఆదాయాన్నిస్తున్నామని అంచనాలు చెప్తున్నాయి. పోని అదేదో ఇక్కడే కొందామా అంటే సగటు భారతీయుడికి ఆర్ధిక లెక్కలు గుర్తొస్తాయ్. ఆ మిగిలిన డబ్బు తీసుకెళ్ళి ఏ బార్లోనో కూర్చుంటే ఓ పూట మందుకో, ఒక వారం సిగరెట్లకో, మొబైల్ రీచార్జ్ ల కో గడిచిపోద్ది కదా.. అది మనోళ్ళ లెక్క.
పోనీ పతీవోడూ చైనా వస్తువులు కొనడం మానేయమంటున్నారే కానీ ఏది చైనా కంపెనీనో ఏది ఇండియా కంపెనీనో ఎవడూ చెప్పట్లేదు. మనం ఏ వస్తువైనా కొనేముందు దానిపై ఉన్న బార్ కోడ్ ను చూసి దానిమీద ఉండే మొదటి మూడు అంకెలూ ఏదేశానికి చెందినవో తెలియచేస్తాయి కాబట్టి 690 నుండి 695 లోపు స్టార్ట్ అవుతుంటే అవి చైనావని అర్ధం చేసుకోవచ్చు. Alcatel, Amoi, BBK, Coolpad, Cubot, Gfive, Gionee, Haier, Hisense, Huawei, Konka, Lenovo, LeEco , Meizu, OnePlus, Oppo, Qihoo 360, QiKU, Ningbo Bird, Smartisan, Technology Happy Life, Vivo, Vsun, Wasam, Xiaomi, Zopo, ZTE, ZUK వంటివి చైనా కంపెనీలు. అవకాశం ఉన్నంతవరకూ వీటిని కొనకుండా ఉంటే ప్రస్తుత పరిస్ధితుల్లో మీరు దేశానికి సేవ చేసినట్టే...!
చైనా వస్తువులు బయట పడేయండి అని నేను చెప్పను. పని చేసినంత కాలం హ్యాపీగా వాడుకోండి. మన మంత్రులకూ రాజకీయనాయకులకూ వచ్చినట్లు మీకు అవేం ఫ్రీగా పర్సంటేజీలతో పాటు రాలేదు కదా, కష్టపడిన డబ్బు ఖర్చు పెట్టి కొన్నారు మీరు. కానీ ఒక్క విషయం.... మీరుగానీ, మీ బంధుమిత్రుల్లో ఎవరైనా గానీ చైనా వస్తువులు వాడుతున్నపుడు వాటిలో మీరు గమనించిన లోపాలను కానీ, పాడైన వస్తువుల్ని కానీ గమనిస్తే ఒక ఫొటో తీసి ఫేస్బుక్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఫలానా చైనా వస్తువు కొన్నాను , ఈ సమస్య వస్తుంది అని కానీ, ఫలానా చైనా వస్తువు పాడైంది అని ఒక్క పోస్ట్ చేయండి చాలు. ఇది చూసి మిగతావాళ్ళు ఆ వస్తువుల్ని కొనడానికి ఆలోచిస్తారు. అది మన సగటు ఇండియన్స్ సైకాలజీ. అలా మీరు చేసే పోస్ట్ వల్ల మాకూ , మన దేశానికీ కూడా చాలా ఉపయోగం ఉంటుంది.
ఇక ఇండియన్ కంపెనీలనే కొనాలి అనుకునేంత దేశభక్తి మీలో ఉంటే Celkon , iball, Intex, Hcl, Karbonn, Lava, LYF, Micromax, Onida, Ringing Bells, Spice, Videocon, virgin, Xolo, YU వంటి ఇండియన్ కంపెనీలవే కొనండి.
మీకు నేను చెప్పినదానితో ఏదైనా క్లారిటీ వస్తే దీనిని మీ మిత్రులకీ చూపించండి. మీరు షేర్ చేసేయగానే ఫలితం వెంటనే వచ్చేస్తుందని నేను చెప్పను. కానీ  కొద్దిరోజుల తరువాతైనా చైనాకూ , పాకిస్తాన్ కూ భారత్ సత్తా తెలుస్తుంది. స్వదేశీ వస్తువుల్ని జనం ప్రోత్సహిస్తున్నారని అర్ధమైతే మన ఇండియాలోనే ఆ చైనా వాళ్ళకు మించిన గొప్ప కంపెనీలు పుట్టుకొస్తాయ్, అప్పుడు చైనా వస్తువులకంటే తక్కువ ధరలోనే మనం మంచి క్వాలిటీ ఉన్న ఇండియన్ మేడ్ వస్తువులను మరింత తక్కువ ధరకే పొందగలం.
అంతేకాక కొన్ని లక్షలమందికి ఉపాధి దొరుకుతుంది.
- వేణు గోపాల రాజు






Original post