Home » » ఒక్కసారి ఆలోచించండి...

ఒక్కసారి ఆలోచించండి...

ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించండి....
తమ డబ్బుని మీ అకౌంట్లో సర్ధుబాటు చేస్తే ఎంతోకొంత ముట్ట చెబుతామని కొంతమంది డబ్బున్నవాళ్ళు పేదమద్య తరగతి వాళ్ళని అడుగుతున్నారు. 

దీనికి కక్కుర్తి పడి, లేదా మొహమాటపడి మీరు ఒప్పుకుంటే... తరువాత ఆల్రెడీ ఆధార్ తో లింక్ అయ్యి ఉన్న మీ బ్యాంకు ఖాతాలని పరిశీలించినపుడు.....

మీ బ్యాంకు లావాదేవీలు ఒక పరిమితి దాటినట్లు గమనిస్తే మీ తెల్లకార్డు రంగు మారిపోవచ్చు ,
మీరు ధనవంతుల లిస్టులో ఉంటారు కాబట్టి మీకు బ్యాంకుల నుంచి రుణాలు, సబ్సిడీలు అందకపోవచ్చు.
మీరుగానీ, మీ తల్లిదండ్రులు గానీ ఫించనులాంటివి పొందుతుంటే అవి ఆగిపోవచ్చు,
భవిష్యత్తులో మీ పిల్లలు విద్య, వివాహ సంబంధ లోన్లు పెట్టుకోవడాని అనర్హులు కావచ్చు,
ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఇచ్చే రుణాలు నిలచిపోవచ్చు,
పేదప్రజల కోసం ప్రభుత్వం కట్టించే ఇళ్ళకు మీరు అర్హత కోల్పోవచ్చు
ఒకవేళ భవిష్యత్తులో కులాన్ని బట్టే కాక ఆర్ధిక స్ధితిని బట్టి ఉద్యోగాలు ఇచ్చేరోజులు వస్తే మీ పిల్లలు దానికి అర్హత కోల్పోవచ్చు
ఇప్పుడున్నవాటితో పాటు త్వరలో ప్రారంభించే అనేక ప్రభుత్వ పధకాలకు మీరు అనర్హులు కావచ్చు
ఆసుపత్రులలో ఆరోగ్య పధకాల ద్వారా ఉచితంగా పొందుతున్న వైద్యసేవలు మీకు, మీకుటుంబానికీ రద్దు కావచ్చు
ఒకవేళ తనిఖీలలో కానీ, విచారణలలో కానీ ఆ డబ్బు మీది కాదనికానీ, ఎవరికో బినామీగా ఉన్నారని కానీ రుజువైతే ఆర్ధిక నేరాల కేసులో శిక్షను అనుభవించాల్సి రావచ్చు.
ప్రస్తుతానికి ఇది నా అంచనా మాత్రమే.. వీటిలో అన్నీ జరగొచ్చు జరగకపోవచ్చు, కానీ వీటిలో ఏ ఒక్కటైనా మీరు వదులుకోవడానికి సిద్ధపడితే మీరు ఎవరికైనా , ఎంతకైనా బినామీలుగా ఉండొచ్చు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇకనుంచి అన్ని లెక్కలూ మారతాయి
 -వేణుగోపాలరాజు.