బాల గంగాధర తిలక్...!
స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని చాటిన సుప్రసిధ్ధ స్వతంత్ర్య సమరయోధుడు, భయమంటే ఎరుగని సాహసికుడు, బ్రిటీష్ వారి ఆంక్షలను ధిక్కరించిన ధీశాలి, జాతీయోద్యమానికి ఊపిరిలూదిన అభ్యుదయవాది, ప్రజలను చైతన్యం చేయడానికి విద్యాసంస్ధలను, పత్రికలను సమర్ధవంతంగా నడిపిన స్పూర్తి ప్రదాత, కష్టాలతో అనారోగ్యాలతో ఉన్న పేదప్రజలకు సహాయం చేసిన మానవతావాది, బ్రిటీష్ వారి అన్యాయాలను పత్రికల్లోకి ఏకిపారేసి వారి గుండెల్లో గుబులు పుట్టించిన సృష్టించిన పాత్రికేయుడు, ప్రజలలో ఉద్యమభావాల్ని పెంచి బ్రిటీష్ ప్రభుత్వానికి అశాంతి కలిగించిన ఉద్యమకారుడు, భారతీయులకు జరుగుతున్నఅన్యాయాలాపై పోరాడిన న్యాయవాది, స్వాతంత్ర్య పోరాటంలో జైలు జీవితం గడిపిన దేశభక్తుడు, భారతీయులు నిరంతరం పూజించాల్సిన భారత జాతీయోద్యమ పిత, యువతకు దిశానిర్దేశం చేసిన స్పూర్తి ప్రదాత, మార్గదర్శకుడు. లోకమాన్య బాల గంగాధర తిలక్ జయంతి నేడు (23/7/1856)
-Venu Gopala Raju