Home » » మొట్ట మొదటి వితంతు పుర్వివాహం జరిగి నేటికి 160 సంవత్సరాలు అవుతుంది (7/12/1856)

మొట్ట మొదటి వితంతు పుర్వివాహం జరిగి నేటికి 160 సంవత్సరాలు అవుతుంది (7/12/1856)


మొట్ట మొదటి వితంతు పుర్వివాహం జరిగి నేటికి 160 సంవత్సరాలు అవుతుంది (7/12/1856)

వితంతు పునర్వివాహ చట్టం అమలు లోకి రావడానికి కృషి చేసిన సుప్రసిద్ధ సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆధ్వర్యంలో శ్రీష్‌చంద్ర విద్యారత్న అనే వ్యక్తి ఒక వితంతువును పునర్వివాహం చేసుకున్నాడు.

160 సంవత్సరాలు అయినా కొంతమంది సాంప్రదాయ కుటుంబాల స్త్రీలలో మార్పు రాలేదు. భర్త మరణించినా, పరిస్ధితుల ప్రభావం వల్ల భర్తకు దూరం అయినా సంఘానికి భయపడి వారు జీవచ్చవంలా ఒంటరిగానే జీవిస్తున్నారు.

మిమ్మల్నీ, మీ కుటుంబ పరిస్ధితుల్నీ అర్ధం చేసుకుని ఆదరించగలిగే వ్యక్తి దొరికితే మళ్ళీ పెళ్ళి చేసుకోవడంలో తప్పే లేదు. ఇప్పుడు మిమ్మల్ని వేలెత్తి చూపించేవారిలో ఏ ఒక్కరూ జీవితాంతం మీ వెంట రారు. ఎవరేమనుకుంటారో అని భయపడి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కలవాళ్ళు, మిగతావారంతా మీ జీవితంలో కొన్నిరోజులు ఉండి తప్పుకునేవారే. జీవితంలో ఎప్పటికీ తోడుండేదీ, ఉండాల్సిందీ జీవిత భాగస్వామి మాత్రమే.