గరిమెళ్ళ సత్యనారాయణ....!
'మా కొద్దీ తెల్ల దొరతనం' అంటూ స్వతంత్ర్య సంగ్రామంలో ప్రజలను ఉర్రూతలూగించి ఉవ్వెత్తున ఎగసిపడిన ఉత్తుంగ ఉద్యమ తరంగం గరిమెళ్ళ సత్యనారాయణ , 'దండాలు దండాలు భారత మాత' వంటి గీతాలతో బ్రిటీష్ దొరలను గడగడలాడించి పాటల తూటాలతో పరుగులు పెట్టించి తన మాటల పంజాతో తెల్లదొరల నిరంకుశపాలనను గురిచూసి కొట్టిన మన అచ్చ తెలుగు కవి గరిమెళ్ళ సత్యనారాయణ.
ప్రజల్లో ఉత్తేజాన్నీ, ధైర్యాన్నీ, స్పూర్తినీ నింపే దేశభక్తి గీతాలను రాసి జైలుశిక్ష అనుభవించిన మొదటి కవి గరిమెళ్ళ సత్యనారాయణ, ఉద్యమ సమయంలో జైలు జీవితం గడుపుతూ తన తండ్రినీ, తాతనీ, భార్యనీ పోగొట్టుకుని కూడా ప్రజల కోసం, దేశం కోసం పోరాడి తన జీవితాన్ని దేశవిముక్తి కోసం తన జీవితాన్ని అర్పించిన నిజమైన దేశభక్తుడు గరిమెళ్ళ సత్యనారాయణ.
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అవిశ్రాంత పోరాటం చేసి కూడా కుటిల రాజకీయాలతో అధికారాన్ని చేజిక్కించుకున్న కొందరు స్వార్ధపరుల పాదసేవ చేయకపోవడంతో ఏ విధమైన గుర్తింపునీ పొందక ఆస్ధుల్నీ, ఆప్తుల్నీ పోగొట్టుకుని అనామకులుగా మిగిలిపోయిన త్యాగమూర్తుల జాబితాలో చేరిన వందలాది నిర్భాగ్యుల్లో ఒకడు గరిమెళ్ళ సత్యనారాయణ.
స్వతంత్ర్యానంతరం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికీ, నిరాదరణకూ గురై , ఏవిధమైన సహాయసహకారాలు లభించక గత్యంతరం లేని పరిస్ధితుల్లో పొట్టకూటికోసం చివరకు బిక్షాటన సైతం చేసి దుర్భర, దీన, నిస్సహాయ స్ధితిలో ఆకలితో మరణించిన దేశభక్తుడు గరిమెళ్ళ సత్యనారాయణ.
నేడు (18/12/1952) ప్రముఖ రచయత, పత్రికా సంపాదకుడు, అనువాదకుడు, స్వతంత్ర్య సమరయోధుడు, ధైర్యశాలి, జాతీయకవి శ్రీ గరిమెళ్ల సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా.... గాంధీ , నెహ్రూల భజన చేయని కారణంగా కనీస గుర్తింపు లేక ఆకలితో, ఆక్రోశంతో అంతమైపోయి కాలగర్భంలో కలిసిపోయిన ఇలాంటి దేశభక్తుల గురించి నేటి తరానికి తెలియచేయాల్సిన భాద్యత మనందరిమీద ఉందని భావిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకురాలని ప్రార్ధిస్తూ నివాళులు అర్పిస్తున్నాను.....! జైహింద్....!!
-VENU GOPALA RAJU