ఈరోజు జాతీయ రైతు దినోత్సవం (23/12/2017) || National Farmer's day
వాని ఱెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనము బెట్టు వానికి భుక్తిలేదు.
- గుర్రం జాషువా...!
ఈరోజు జాతీయ రైతు దినోత్సవం (23/12/2017) సందర్భంగా....
కనీస గిట్టుబాటు ధర రాకపోయినా కష్టనష్టాలను ఓర్చుకుంటూ , నిరాశ నిస్పృహల మద్యలో నిరాదరణకు గురౌతూ, ఆకలినీ అప్పులనీ అనారోగ్యాలనీ మౌనంగా భరిస్తూ కూడా ప్రజలకి అన్నం పెట్టాలనే సదుద్దేశ్యంతో వేరే ఉపాధిని వెతుక్కోకుండా ఆశగా, అమాయకంగా వ్యవసాయం చేస్తూ తమ చెమటను చిందించి, రక్తాన్ని ధారబోసి , జీవితాన్ని పణంగా పెట్టి మన ఆకలి తీర్చి అన్నదానం చేస్తున్న రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు , అభినందనలు....!
పొలాలనన్నీ హలాలదున్నీ ఇలాతలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామమెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే, కర్షక వీరుల కాయం నిండా కాలువకట్టే ఘర్మజలానికి, ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదోయ్....!
- శ్రీశ్రీ.
ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా....