రేపటి నుంచి నెల్లూరులో ఉపరాష్ట్రపతి పర్యటన..

నెల్లూరు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రేపటి(మంగళవారం) నుంచి నాలుగు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు వెంకటాచలంకు ఉపరాష్ట్రపతి రానున్నారు.27న ఆల్ ఇండియా రేడియో స్టేషన్‌ను జాతీకి అంకితం చేయనున్నారు. ఆపై అల్లూరులో దేవిరెడ్డి శారద స్వచ్చంద సేవా సంస్థ ప్రారంభోత్సవంలో వెంకయ్య పాల్గొననున్నారు. 28న స్వర్ణభారత్ ట్రస్ట్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. 29 ఉదయం ఉపరాష్ట్రతి వెంకయ్యనాయుడు తిరుగుపయనం అవనున్నారు.