Home » » 2500 లీటర్ల సారా ఊట ధ్వంసం

2500 లీటర్ల సారా ఊట ధ్వంసం

 

2500 లీటర్ల సారా ఊట ధ్వంసం

2500 లీటర్ల సారా ఊట ధ్వంసం

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం పరిధిలో నాటు సారా తయారు చేస్తున్న స్థావరాలపై దాడి చేసి 2500 లీటర్ల సారా ఊటను, 40 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మారుతి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదుం మండలం బూరగమంద పంచాయతీ కొత్త వడ్డెపల్లి పరిసర ప్రాంతాలలో భారీగా నాటుసారా తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో వెళ్లి పరిసర ప్రాంతాలల్లో దాచి ఉంచిన నాటుసారా ఊటను ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు.
దీంతోపాటు ఇందుకు సంబంధించిన ముడిసరుకులు కూడా స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు. ఇదే కాకుండా తయారు చేసి ఉంచిన 40 లీటర్ల నాటుసారాను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇదే పంచాయతీకి రామాపురంకు చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు ఎ. రమణ 80 ప్యాకెట్లు నాటుసారా ఉన్నట్లు గుర్తించామని, సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టుచేసి పీవేరు జ్యూడీషియల్ కోర్టుకు తరలించామన్నారు.
కొత్త వడ్డీ పల్లిలో నాటు సారా తయారికి పాల్పడుతున్న వ్యక్తులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్ఐ తెలిపారు.