Home » » నారా లోకేష్ ను కలిసిన ఆదిరెడ్డి వాసు - అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం

నారా లోకేష్ ను కలిసిన ఆదిరెడ్డి వాసు - అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం

 

నారా లోకేష్ ను కలిసిన ఆదిరెడ్డి వాసు 

- అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం





రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని క్వారీ సెంటర్ ప్రాంతంలో శుక్రవారం (24.06.2022) ఉదయం 11 ప్రారంభించనున్న అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి నారా లోకేష్ ను ఆదిరెడ్డి వాసు ఈ సందర్భంగా ఆహ్వానించారు. అనంతరం వారు పలు విషయాలపై చర్చించుకున్నారు.  అన్న క్యాంటీన్ రాజమహేంద్రవరంలో ప్రారంభించడం మంచి పరిణామమని లోకేష్ అభినందించారు. అలాగే బాదుడే బాదుడు కార్యక్రమం బాగా జరిగిందని, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా బాగా జరుగుతోందని లోకేష్ అభినందించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్టు ఆదిరెడ్డి వాసు.... నారా లోకేష్ కు తెలిపారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామన్నారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ వారితో ఉన్నారు.