మనందరి సమిష్టి కృషితోనే మాదకద్రవ్యాల నియంత్రణ సాధ్యం-స్పెషల్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ
మనందరి సమిష్టి కృషితోనే మాదకద్రవ్యాల నియంత్రణ సాధ్యం-స్పెషల్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ
కృష్ణాజిల్లా
మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ పి. జాషువా ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. అందులో భాగంగా ఈరోజు SEB ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల నందు మాదక ద్రవ్యాల వినియోగ నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ శ్రీమతి అస్మా ఫర్హిన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో SEB ఇన్స్పెక్టర్స్ తులసి ధర్, రమేష్, నోబుల్ కళాశాల ప్రిన్సిపల్ ఎర్నెస్ట్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ చిన్ని అలవాటుగా మారిన మాదక ద్రవ్యాల వినియోగం ఒక వ్యసనంలా మారి జీవితాలను చిదిమివేస్తుంది. వీటిని ఉపయోగించడం వలన కొంచెం సేపు ఆనందం లభించిన, మిగిలిన జీవితం మొత్తం బాధలో పడవేస్తుంది. మీ అందరూ మంచి విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకుని మీ కుటుంబానికి, మీ గ్రామానికి, ఈ సమాజానికి మంచి పేరు తీసుకురావాలి. మాదకద్రవ్యాల కు బానిసలుగా మారి సమాజంలో తలవంపులు తెచ్చుకోకూడదు అని తెలిపారు. మీ సమీపంలో తెలిసిన వారు ఎవరైనా మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందజేయాలని, మీ సమాచారం గోప్యంగా ఉంచి మాదక ద్రవ్యాల నియంత్రణ లో నిరంతరం కృషి చేస్తామని, మన అందరి సమిష్టి భాగస్వామ్యం వల్లనే ఆనందకరమైన సమాజం నిర్మించడం సాధ్యమవుతుందని తెలిపారు.
అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అధికారులతో, అధ్యాపకులతో, విద్యార్థులతో మాదకద్రవ్యాల భూతాన్ని సమాజం నుండి వెలి వేయడానికి మా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రతిజ్ఞ చేయించారు