ఎమ్మెల్సీ ఓట్లు ఎలా లెక్కిస్తారా తెలుసా
ఎమ్మెల్సీ ఓట్లు ఎలా లెక్కిస్తారా తెలుసా
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఉత్కంఠంగా సాగుతుంది అయితే సాధారణ ఎన్నికల మాదిరిగా ఓట్ల లెక్కింపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండదు. సాధారణ ఎన్నికల్లో ప్రత్యర్థి కన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా ఆ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటిస్తారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలా ఉండదు. మొత్తం పోలైన ఓట్లలో సగానికి కంటే ఎక్కువ ఓట్లు వస్తేనే గెలిచినట్లు. ఏపీ శాసనస మండలి ఎన్నికలు పట్టభద్రులు, ఎమ్మెల్యేలతో పాటు సామాన్య ప్రజా నీకాన్ని సైతం ఆసక్తి కలిగిస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో ఓటరు ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం పాధాన్యతకు అనుగుణంగా అభ్యర్థిని ఎన్నుకోవచ్చు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఏ విధంగా వేస్తారో ఒక్కసారి పరిశీలిద్దాం.
ప్రాధాన్యత ఓటింగ్ విధానం
►ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది. కానీ, ప్రాధాన్యత క్రమంలో ఓటేయ్యాలి. దీనినే ప్రాధాన్యత ఓటింగ్ క్రమం అంటారు. అంటే ఓటరు తనకు నచ్చే అభ్యర్థుల ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయవచ్చు. తనకు బాగా నచ్చిన అభ్యర్థికి ‘1’ ప్రాధాన్యత ఓటు వేశాక మిగిలిన అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో 2,3,4 ఇలా ఎంతమందికైనా ఓటు వేయవచ్చు.
►పోలైన మొత్తం ఓట్లలో సగం కన్నా ఒక్క ఓటు ఎక్కువగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఉదాహరణకు ఒక ప్రాంతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా మొత్తం 15000 ఓట్లు పోలయ్యా యి అనుకుంటే అందులో గెలవడానికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 7,501 రావాల్సి ఉంటుంది. అలా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.
అభ్యర్థుల్లో ఏ ఒక్కరికీ మొదటి ప్రాధాన్యత ఓట్లు రాకుంటే ఈ కింది విధంగా లెక్కిస్తారు.
►అ అభ్యర్థికి - 4,000
►ఆ అభ్యర్థికి - 5,000
►ఇ అభ్యర్థికి - 3,000
►ఈ అభ్యర్థికి - 1,000
►ఉ అభ్యర్థికి - 800
►ఊ అభ్యర్థికి -1200 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి అనుకుందాము.
♦ఇందులో ఏ అభ్యర్థికి కూడా 50శాతం కంటే ఎక్కువగా అనగా 7501 ఓట్లు రాలేదు. కనుక ఎవరూ గెలవలేదు. దీంతో ప్రాధాన్యత ఓటింగ్‌లో ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కిస్తారు.
♦అంటే ఇందులో ఉ అభ్యర్థికి అందరి కన్నా త క్కువ ఓట్లు వచ్చినందున అతడిని పోటీనుంచి ఎలిమినేట్ చేస్తారు. అతడికి వచ్చిన 800 ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వ చ్చాయో వాటిని పంపిణీ చేస్తారు. ఈ 800 ఓట్లలో అ అభ్యర్థికి 300, ఆ అభ్యర్థికి 200, ఇ అభ్యర్థికి 100, ఈకి 50, ఊ అభ్యర్థికి 150 రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి అనుకుందాము. అప్పుడు
►అ అభ్యర్థికి 4000+300=4300
►ఆ అభ్యర్థికి 5000+200=5200
►ఇ అభ్యర్థికి 3000+100=3100
►ఈ అభ్యర్థికి 1000+50=1,050
►ఊ అభ్యర్థికి 1200+150=1350 ఓట్లు వచ్చాయి.
♦కానీ గెలవడానికి కావాల్సిన 7501 ఓట్లు ఎవరికీ రానందున అందులో పై అభ్యర్థుల్లో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన ఈ అభ్యర్థిని పోటీనుంచి తప్పించి అతడికి వచ్చిన 1000 ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు 50. మూడో ప్రాధాన్యత ఓట్లను మిగతా నలుగురికి పంపిణీ చేస్తారు.
♦ఈ అభ్యర్థికి వచ్చిన మొదటి 1000 ప్రాధాన్యత ఓట్లలో అ అభ్యర్థికి 200, ఆ అభ్యర్థికి 550, ఇ అభ్యర్థికి 100, ఊ అభ్యర్థికి 150 ఓట్లు చొప్పున రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి అనుకుందాం. అలాగే ఈ అభ్యర్థికి వచ్చిన 50 రెండో ప్రాధాన్యత ఓట్లు గల బ్యాలెట్ పేపర్‌లో అ,ఆ,ఇ,ఊ అభ్యర్థులకు వచ్చిన మూడో ప్రాధాన్యత ఓట్లను కలుపగా అకు 10 ఓట్లు, ఆకు 30, ఇకు 3, ఊ నకు7 మూడో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. అప్పుడు
►అ అభ్యర్థికి 4300+200+10=4510
►ఆ అభ్యర్థికి 5200+550+30=5780
►ఇ అభ్యర్థికి 3100+100+3=3203
►ఊ అభ్యర్థికి 1350+150+7=1507
♦ ఇప్పుడు కూడా అ,ఆ,ఇ,ఊ లలో ఎవరికి కూడా గెలుపునకు అవసరమైన 7,501 ఓట్లు ఎవరికి రా లేదు. కావున పై నలుగురు అభ్యర్థులలో అతి త క్కువ ఓట్లు వచ్చిన ఊ అభ్యర్థిని పోటీ నుంచి తొలగించి అభ్యర్థికి వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లు 1200, రెండో ప్రాధాన్యత ఓట్లు 200, మూడో ప్రా« దాన్యత ఓట్లు 7లలో ఉన్న రెండు, మూడు, నా లుగో ప్రాధాన్యత ఓట్లు పొందిన మిగిలిన ముగ్గురు అభ్యర్థులకు పంపిణీ చేస్తారు.
♦ అలా చేయగా అ అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓట్లు 200, మూడో ప్రాధాన్యత ఓట్లు 30, నాలుగో ప్రాధాన్యత ఓట్లు 1 వచ్చి మొత్తంగా 4741 ఓట్లు వచ్చాయి.
♦ ఆ అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓట్లు 1000, మూడో ప్రాధాన్యత ఓట్లు 110, నాలుగో ప్రాధాన్య త ఓట్లు 5 వచ్చి మొత్తంగా 6895 ఓట్లు వచ్చాయి.
♦ ఇ అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓట్లు 150, మూడో ప్రాధాన్యత ఓట్లు 10, నాలుగో ప్రాధాన్యత ఓట్లు 1 ఓట్లు మొత్తం కలిపి 1668 ఓట్లు వచ్చాయి.
♦ అయినా, అ,ఆ,ఇలలో ఎవరికి కూడా గెలుపునకు అవసరమైన 7501 ఓట్లు రాలేదు. కావున పై ముగ్గురు అభ్యర్థుల్లో అతి తక్కువ ఓట్లు వచ్చిన ఇ అభ్యర్థిని పోటీనుంచి తొలగించి అభ్యర్థికి వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లు 3000, రెండో ప్రాధాన్యత ఓట్లు 100, మూడో ప్రాధాన్యత ఓట్లు 3, నాలుగో ప్రాధాన్యత 1 ఓట్లలో ఉన్న రెండు, మూడు, నాలుగు, ఐదో ప్రాధాన్యత ఓట్లు పొందిన మిగిలిన ఇద్దరు అభ్యర్థులకు పంపిణీ చేస్తారు.
♦ అలా చేయగా అ అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓట్లు 1200, మూడో ప్రాధాన్యత ఓట్లు 30, నా లుగో ప్రాధాన్యత ఓట్లు 2, ఐదో ప్రాధాన్యత ఓట్లు 0 వచ్చాయి.
♦ అలాగే ఆ అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓట్లు 1800, మూడో ప్రాధాన్యత ఓట్లు 40, నాలుగో ప్రా« దాన్యత ఓట్లు 1, ఐదో ప్రాధాన్యత ఓట్లు 1 వ చ్చాయి. అప్పుడు మొత్తంగా
►అ అభ్యర్థికి 4771+1200+30+2+0=6003
►ఆ అభ్యర్థికి 6895+1800+40+1+1=8767
♦ దీంతో ప్రాధాన్యత ఓటు క్రమంలో ఆ అభ్యర్థికి పోలైన ఓట్లలో 50శాతం కంటే ఎక్కువగా అనగా 7501 ఓట్ల కంటే ఎక్కువగా వచ్చాయి కనుక ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటించి ఫలితాలు వెల్లడిస్తారు. ఒక వేళ రెండో ప్రాధాన్యతలోనూ ఏ అభ్యర్థికి కూడా 50శాతం కంటే ఎక్కువగా రాకుంటే మూడు, నాలుగు ఆ కింది ప్రాధాన్యత ఓట్లు లెక్కించి మొత్తం ఓట్లలో సగానికి కంటే ఎక్కువ ఓట్లు పోలైన అభ్యర్థి విజేతగా ప్రకటిస్తారు.