మొదటిసారిగా మన జాతీయగీతం (జనగణమన ) ని కలకత్తా కాంగ్రెస్ సభల్లో పాడి నేటికీ 106 సంవత్సరాలు అవుతుంది (27/12/1911)
1911 డిసెంబర్ 27 న పాడిన జాతీయగీతాన్ని 1950 జనవరి 24 న మన జాతీయగీతం గా రాజ్యాంగం స్వీకరించింది
దీనికి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ టాగోర్ రచించారు ..
ఈ గీతానికి సంగీత బాణీ కూడా ఠాగూర్ సృష్టించాడు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది
అప్పుడప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది.
భారత జాతీయగీతం:
జనగణమన-అధినాయక జయ హే భారతభాగ్యవిధాతా!
పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ బంగ
వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛలజలధితరంగ
తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే,
గాహే తవ జయగాథా।
జనగణమంగళదాయక జయ హే భారతభాగ్యవిధాతా!
జయ హే, జయ హే, జయ హే, జయ జయ జయ జయ హే।।