ఖుదీరామ్ బోస్.....
గాంధీ, నెహ్రూల భజనతో మకిలి పట్టిన పాఠ్యపుస్తకాలను చదువుకుని అంతకు మించిన దేశభక్తులు కానీ, అంతకుమించిన చరిత్ర కానీ లేదనుకునే సగటు తెలుగువాడికుండే అజ్నానం లోంచి సమాధి చేయబడ్డ చరిత్రలను తవ్వుకుంటూ నిజాలను వెతుక్కుంటున్న రోజుల్లో ఒక ఆర్.ఎస్.ఎస్ కార్యాలయంలో మొట్ట మొదటిసారిగా చదివాను ఖుదీరామ్ బోస్ గురించి....!
" నేను పట్టుబడితే మహా అయితే నన్ను ఉరి తీయవచ్చును కానీ ఇది నాకు వరం , నాకు తల్లి , తండ్రి గురువు అన్నీ భరతమాతే... ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి నా ప్రాణాలను అర్పించడం నా అదృష్టంగా భావిస్తాను, నా కోరిక ఒక్కటే... మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకూ నేను మళ్ళీ మళ్ళీ ఈ గడ్డపైన పుట్టి నా జీవితాన్ని త్యాగం చేయాలని " అంటూ విప్లవవీరుల రహస్య సమావేశంలో సాయుధ పోరాటంలో రాటుదేలిన యోధులకి సైతం స్పూర్తినిస్తూ .... ముక్కుపచ్చలారని పసివాడు ఖుదీరామ్ బోస్ బాంబుదాడి చేయడానికి వెళుతూ చెప్పిన మాటలు నేను మర్చిపోలేను
భరతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి, భారతీయుల బానిసత్వాన్ని నిర్మూలించడానికి , అంగ్లేయుల అక్రమాలను అంతమొందించడానికి సాయుధ పోరాటానికి నాంది పలుకుతూ బ్రిటీష్ వారిపై మొట్టమొదటిగా బాంబు విసిరిన విప్లవవీరుడు ఖుదీరామ్ బోస్,
వందేమాతర నినాదాన్నే ఊపిరిగా, తెల్ల దొరలను తరిమి కొట్టడమే ధ్యేయంగా , పాఠ్యపుస్తకాలను వదిలి పోరుబాట పట్టి స్వాతంత్ర్య కాంక్షతో అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన దేశభక్తుడు ఖుదీరామ్ బోస్ ,
పాలుగారే పసితనంలో పలక పుస్తకం పట్టి ఆటపాటలతో గడపాల్సిన సమయంలో ఆంగ్లేయుల చేతిలో హింసలకు బలౌతున్న భారతీయలను ఎలా కాపాడగలనని ఆలోచిస్తూ ప్రాణాలు ఇచ్చైనా పోరాటం చేయాలని విప్లవమార్గం పట్టిన దేశభక్తుడు ఖుదీరామ్ బోస్.
వందేమాతర గీతం యొక్క సారాన్ని నిరక్షరాస్యులైన ప్రజలకు అర్ధమయ్యేలా, విద్యావంతులకు స్పూర్తినిచ్చేలా కరపత్రాలను తయారు చేసి స్వయంగా పంచుతూ అడ్డగించిన బ్రిటీష్ సైనికులపై ప్రతిదాడి చేసి బ్రిటీష్ ప్రభుత్వానికి వణుకు పుట్టించిన భారత బెబ్బులి ఖుదీరామ్ బోస్.
.
.
అత్యంత క్రూరుడైన కింగ్ ఫోర్ట్ పై మొట్ట మొదటి బాంబుదాడి చేసి బ్రిటీష్ దొరలకు ప్రాణభయాన్ని రుచి చూపించిన మొట్టమొదటి భారతీయుడు ఖుదీరామ్ బోస్.
బ్రిటీష్ వారిచ్చే బహుమతికి కక్కుర్తిపడి సాటి భారతీయుడే తనని పట్టిస్తే, ఉరిశిక్ష విధించిన జడ్జీ నీ చివరికోరిక ఏంటని ప్రశ్నించినపుడు ఖుదీరామ్ బోస్ చెప్పిన సమాధానం " మీరు గనుక అనుమతిస్తే ఇక్కడున్న నా భారతీయ సోదరులకు కూడా బాంబుల తయారీ గురించీ, దాని మెళుకువల గురించీ చెప్పాలనుకుంటున్నాను " అని. కోర్టు దానికి అనుమతించకపోవడంతో తన స్పూర్తిని ప్రజల్లో నింపుతూ వందేమాతర నినాదం చేస్తూ, భరతమాతకు జై కొడుతూ భగవద్గీత చేత్తో పట్టుకుని ఉరికంబానికి వేలాడి తన దేశభక్తిని చాటుకున్న గొప్ప దేశభక్తుడు ఖుదీరామ్ బోస్....!!!
ఇలాంటి దేశభక్తుల చరిత్రలు తెలియని మీ మిత్రులకూ, పిల్లలకూ ఇలాంటి వారిని గురించి తెలియచేసి మీ దేశభక్తిని చాటుకుంటారని ఆశిస్తూ.... ఈరోజు ఎందరికో స్పూర్తి నింపి మరెందరికో ఆరాద్యనీయుడైన సుప్రసిద్ద స్వతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి (3/12/1889) సందర్భంగా నా నివాళులు అర్పిస్తున్నాను. .....
- పార్ధు వేణుగోపాలరాజు.