దేవానంద్....
ఆ రోజుల్లో రెండుమూడు తరాల అమ్మాయిలు దేవానంద్ అందానికి పడి చచ్చేవారు, మనవరాలి వయసున్న అమ్మాయిలు కూడా దేవానంద్ లాంటి మొగుడు రావాలని కోరుకునేవారు, దేవానంద్ ని అనుకరిస్తే తప్ప అమ్మాయిలు తమకు పడరని అబ్బాయిలు డిసైడ్ అయ్యేవారు,
సిగరెట్ పట్టుకునే స్టైల్ , మందు తాగే స్టైల్, ఒక పక్కకు వంగి నడిచే ఆ నడక, విలాసంగా చెప్పే ఆ డైలాగులు, దేవానంద్ ని ఎవర్ గ్రీన్ హీరోని చేసాయి. అమ్మాయిలతో సరదాలు, రొమాన్స్ అతన్ని చివరి వరకూ రొమాంటిక్ హీరోగానే నిలిపాయి, రొమాన్స్ అంటే దేవానంద్ కి ఎంత ఇష్టం అంటే తన ఆత్మకధకి కూడా 'రొమాన్స్ విత్ లైఫ్' అనే పేరు పెట్టుకున్నాడు.
త్రివిక్రమ్ రాసిన సినిమాల్లో హీరోల క్యారెక్టర్ దేవానంద్ స్టైల్ ను , హావభావాలనూ దృష్టిలో పెట్టుకుని రాస్తాడనీ, అతని మీద దేవానంద్ ప్రభావం ఉంటుందనే విషయం దేవానంద్ సినిమాలు చూసిన కొందరికే తెలుసు. దేవానంద్ కి గోదావరి అంటే చాలా ఇష్టం. అందుకే దేవానంద్ లండన్ లో మరణించినప్పుడు అంత్యక్రియలు అక్కడే చేసినప్పటికీ అతని కోరిక మేరకు అతని అస్తికలను తెచ్చి గోదావరి జలాల్లో కలిపారు.
తన విలక్షణమైన స్టైల్ తో , హావభావాలతో విపరీతమైన ప్రేక్షకాదరణ పొందిన సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు, విపరీతమైన లేడీ ఫాలోయింగ్ కలిగిన ఎవర్ గ్రీన్ రొమాంటిక్ హీరో, నిర్మాత, కధా రచయత, దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే , పద్మశ్రీ, పద్మభూషణ్ లతో పాటు అనేక ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్న దేవానంద్ వర్ధంతి నేడు (3/12/2011)
-Venu goapala raju