Home » » ప్రఖ్యాత వైద్యశాస్త్రజ్ఞుడు,వైద్య శాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత డా. యల్లాప్రగడ సుబ్బారావు గారి పుట్టిన రోజు నేడు (12/01/1895)

ప్రఖ్యాత వైద్యశాస్త్రజ్ఞుడు,వైద్య శాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత డా. యల్లాప్రగడ సుబ్బారావు గారి పుట్టిన రోజు నేడు (12/01/1895)

ప్రఖ్యాత వైద్యశాస్త్రజ్ఞుడు,లెడర్లీ ప్రయోగశాలలో వైద్యబృందం నాయకులుగా ఫోలిక్ ఆమ్లం యొక్క నిజస్వరూపాన్ని కనుగొన్న వ్యక్తి ,రక్తహీనత వల్ల వచ్చే వ్యాధులకు, బోదకాలు, టైఫాయిడ్, పాండురోగం మొదలైన వాటికీ మందు కనిపెట్టి నిర్ములించిన ఘనుడు , దేశ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో విదేశీ దుస్తులను బహిష్కరించి, ఖద్దరు దుస్తులతో కాలేజీకి వెళ్లిన దేశభక్తుడు ,వైద్య శాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత డా. యల్లాప్రగడ సుబ్బారావు గారి పుట్టిన రోజు నేడు (12/01/1895)
ఈ ప్రకృతిని శోధించి పరిశీలించే శక్తిని, తనను తాను ఉద్దరించుకునే మేధస్సును మానవుడు అంతరాత్మ ద్వారా సాధించాడు. అయితే విజ్ఞాన శాస్త్ర పరిధిలో అది చాలా చిన్న అడుగు మాత్రమే. సంఘర్షణ, పరిశోధకత్వం మానసిక స్థాయిలోనే జరిగింది. ఈ అంశాన్ని నేను ద్రవస్ఫటికాలను అధ్యయనం చేసినప్పుడు గ్రహించాను. ఇవి ఏకకణ సూక్ష్మ జీవి (అమీబా) భౌతిక ధర్మాలను కలిగి ఉంటాయి. ప్రాణశక్తి మాత్రం గ్రహాంతర రోదసి నుంచి లభించింది. ఈ జీవ శక్తి ఏదో తెలియని కారణాల వల్ల విచిత్రంగా ద్రవస్ఫటికాల తరహా పదార్థాలలో ప్రవేశించి వుంటుందని నా అభిప్రాయం. ప్రకృతి-సృష్టి భ్రమణంలో మనకు తెలియకుండా/అవగాహనకు అందని ఖాళీలను మనం పూరించవలసి ఉంది
— యల్లాప్రగడ సుబ్బారావు