Home » » AP NEWS: అమరావతి రైతుల మహా పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతి

AP NEWS: అమరావతి రైతుల మహా పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతి

 

AP NEWS: అమరావతి రైతుల మహా పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతి

AP NEWS: అమరావతి రైతుల మహా పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతి

అమరావతి: రాజధాని రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు తలపెట్టిన మహాపాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. పరిమిత ఆంక్షలతో పాదయాత్ర కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది.అమరావతి రైతు ఉద్యమం ప్రారంభమై వెయ్యి రోజులకు చేరుకుంటున్న సందర్భంగా అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు ఈనెల 12 నుంచి తలపెట్టిన మహాపాదయాత్రకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు, ఎ.శివారెడ్డి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందంటూ పాదయాత్రకు గురువారం అర్ధరాత్రి డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పాదయాత్రకు డీజీపీ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో రైతులు వేసిన పిటిషన్‌ను శుక్రవారం మొదటికేసుగా ధర్మాసనం విచారించింది. పాదయాత్ర అనుమతి కోసం పోలీసులకు ఈరోజే దరఖాస్తు చేసుకోవాలని రైతుకు న్యాయస్థానం సూచించింది. రైతుల దరఖాస్తును పరిశీలించి వెంటనే అనుమతులివ్వాలని పోలీసుశాఖను హైకోర్టు ఆదేశించింది. పాదయాత్రలో 600 మంది పాల్గొనేలా అనుమతించింది. పాదయాత్ర ముగింపు సభకు ముందస్తుగా అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు.