9న నన్నయ వర్సిటీలో 'కందుకూరి జయంత్యుత్సవం'
బ్రోచర్ ఆవిష్కరించిన వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు
బ్రోచర్ ఆవిష్కరిస్తున్న వీసీ జగన్నాథరావు
ఈ నెల 19వ తేదీన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సెమినార్ హాల్ లో జయంత్యుత్సవం – కందుకూరి@175 గ్రంథావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్ ను వీసీ ఆవిష్కరించి వివరాలను తెలియజేసారు. కె.ఆర్.ఎస్ – టి.ఎస్.బి. ఈడిఎన్, చారిటబుల్ బ్రహ్మ సమాజ్ ట్రస్ట్, కాకినాడ సౌజన్యంతో యుగపురుషుడు, నవయుగ వైతాళికుడు శ్రీ కందుకూరి వీరేశలింగం జయంత్యుత్సవం – కందుకూరి@175 గ్రంథావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 19వ తేది ఉదయం 11 గంటలకు యూనివర్సిటీ సెమినార్ హాల్ లో జరిగే ఈ కార్యక్రమంలో “సుబ్రహ్మణ్య భారతి దృష్టిలో కందుకూరి” అనే అంశంపై ప్రధానవక్త మేనేజింగ్ ట్రస్టి, చెన్నపూరి తెలుగు అకాడమీ డా.తూమాటి సంజీవరావు ఉపన్యసిస్తారన్నారు. అతిథులుగా డా.దాట్ల దేవదానంరాజు, పల్లెసిరి కార్యదర్శి పలుకూరు మురళిధర్ హాజరై సందేశాలనందిస్తారని చెప్పారు. కార్యక్రమ కన్వీనర్ గా తెలుగుశాఖ విభాగాధిపతి డా.కె.వి.ఎన్.డి.వరప్రసాద్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓ.ఎస్.డి. ఆచార్య ఎస్.టేకి, తెలుగుశాఖ అధ్యక్షులు డా.కె.వి.ఎన్.డి.వరప్రసాద్, అధ్యాపకులు డా.టి.సత్యనారాయణ, డా.లక్ష్మీనరసమ్మ తదితరులు పాల్గొన్నారు.