Home » » మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు..

మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు..

 

మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు..

విశాఖ (Visakha): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతాన్ని అనుకుని కొనసాగుతోందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు.శుక్రవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మరో 36 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. విశాఖ జిల్లా భీమిలిలో 21 సెంటి మీటర్లు వర్షపాతం నమోదు అయిందని, కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల నుంచి 55 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్యకారులు మరో మూడు రోజుల పాటు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని సునంద సూచించారు.