Loan App: చట్టవిరుద్ధమైన లోన్ యాప్ లపై కేంద్రం సీరియస్
ఢిల్లీ (Delhi): చట్ట విరుద్దమైన లోన్ యాప్ (Loan app)లపై కేంద్రం సీరియస్ అయింది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman) ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.అక్రమ లోన్ యాప్‌ల ఆట కట్టించేందుకు కఠిన చర్యలకు ప్రణాళిక రచించింది. చట్టబద్దమైన యాప్‌ల వైట్ లిస్ట్‌ను తయారు చేయాలని ఆర్‌బీఐ (RBI)కు కేంద్రం ఆదేశించింది. వైట్ లిస్ట్‌లో ఉన్న లోన్ యాప్‌లను మాత్రమే యాప్ స్టోర్‌లలో హోస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. అక్రమ లోన్ యాప్‌ల లావాదేవీలపై ఈడీ, సీబీఐ దృష్టి సారించాలని నిర్ణయించింది. అక్రమ లోన్ యాప్‌ల ఆట కట్టించేందుకు అన్ని మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలు కలిసికట్టుగా పనిచేయాలని సమావేశంలో కేంద్రం నిర్ణయించింది.